అలరించిన అన్నమాచార్య సంకీర్తనామృతం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై సోమవారం సూరపనేని శ్రీకాంత్ ఎండోమెంట్ కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, భజన బృందం జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీవత్స భజనమండలి తెనాలి, కొండపి వసుంధర బృందంచే అన్నమాచార్య సంకీర్తనల గానం శ్రావ్యంగా సాగింది. వీరికి కీబోర్డుపై రామకృష్ణ, తబలపై వెంకటరమణ చక్కటి వాయిద్య సహకారాన్ని అందించారు. ఆలయ కమిటి సభ్యులు సూరపనేని శ్రీరామచంద్రమూర్తి, జయలక్ష్మి ల నిర్వహణలో భజన బృందం వారిని ఘనంగా సత్కరించారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి