ఆకట్టుకున్న శ్రీకృష్ణ రాయబారం హరికథాగానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం కళ్ళం హరనాథరెడ్డి గారి జయంతి సందర్భంగా శ్రీకృష్ణ రాయభారం హరికథాగానం కార్యక్రమం జరిగింది. తొలుత కళ్ళం హరనాథరెడ్డి కుటుంబసభ్యులు, ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య, జాగర్లమూడి మల్లికార్జునరావు తదితరులు హరనాథరెడ్డి గారి చిత్రపటానికి పూలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ హరికథకురాలు వేదవతి భాగవతారిణి హరికథను ప్రారంభిస్తూ ఇది మహాభారతంలోని కృష్ణుడు శాంతిస్థాపన కోసం దుర్యోధనుడి సభకు రాయబారిగా వెళ్లిన సన్నివేశంపై ఆధారపడి ఉంటుందని, ఈ కథను శ్రీకృష్ణుడు రాయబారంలో చూపిన చాతుర్యం, ధర్మం, కౌరవ సభలోని సన్నివేశాలను వర్ణిస్తూ తన బాణీలో పలు పద్యాలను ఆలపించి శ్రీకృష్ణ రాయభారంలో కృష్ణుడు చూపిన దౌత్యం, ధర్మం, దుర్యోధనుడితో జరిగిన సంభాషణలు ప్రధానాంశాలుగా తీసుకొని హరికథ రూపంలో తెలిపి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి తబలపై నాగప్రసాద్, కీబోర్డుపై మల్లేశ్వరరావు లు చక్కటి వాయిద్య సహకారం అందించారు.

.jpeg)



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి