ఆకట్టుకున్న తాళంభజన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం సాయంత్రం శ్రీ ఆంజనేయ భక్త సమాజం, ఉన్నవ వారి భజన కార్యక్రమం నిర్వహించారు. తొలుత ఆలయ కమిటి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ మహిళా కళాశాల సంస్కృతాధ్యపకులు డాక్టర్ పరుచూరి విజయలక్ష్మి కబీరు హిందీలో రచించిన పద్యాలను ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వరరావు తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాన్ని ద్వితీయ ముద్రణ చేశారని తెలుపుతూ కబీర్ సర్వమానవ సమానత్వంపై రాసిన పద్యాలు సమాజంలో ఒక మంచి అనునయాన్ని కల్పించాయన్నారు. భూసురపల్లి విజయలక్ష్మికి మొదటి ప్రతిని అందించారు. కార్యక్రమంలో గుళ్ళపల్లి సుబ్బారావు, పెద్ది సాంబశివరావు కుటుంబ సభ్యలు పాల్గొన్నారు. అనంతరం ఆంజనేయ భక్త సమాజం ఉన్నవ కుర్రా ఆంజనేయులు బృందంచే పలు భక్తిగీతాలను ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి