ఆకట్టుకున్న వాగ్గేయకారుల ఆధ్యాత్మిక ప్రసంగం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో అన్నమయ్య కళావేదికపై నిర్వహిస్తోన్న సంగీత నృత్యోత్సవాలు గురువారం రెండో రోజుకి చేరాయి. శ్రీదాస సాహిత్య ప్రాజెక్ట్, టీటీడీ, శ్రీ కంచి కామకోటి శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం (గుంటూరు) ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ న్యూఢిల్లీ(తిరుపతి రీజియన్), ద్వారం లక్ష్మీ అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్(తిరుప తి) సంయుక్త ఆధ్వర్యంలో జరగ్గా, సంస్థలు, ఆలయ పాలకమండలి సభ్యులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. వాగ్గేయకారుల భక్తి వైభవంపై వాచస్పతి ముప్పవరపు వెంకట సింహాచలశాస్త్రి ధార్మికోపన్యాసం చేయగా, భక్తులను ఆకట్టుకుంది. అనంతరం భువనేశ్వరి బృందం (బెజవాడ) శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. వయోలిన్‌పై చావలి శ్రీనివాస్, మృదంగంపై బి.సురేష్బాబు చక్కటి వాయిద్యాన్ని అందించారు. అనంతరం కళాకారులను సంస్థ కార్యదర్శి వెంకటరమణ సత్కరించారు.
.jpeg)

.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి