భూసురపల్లి ఆదిశేషయ్య ఆదర్శనీయుడు
డోలు విద్వాంసుడు భూసురపల్లి ఆదిశేషయ్య సంగీత కళాకారులకు ఆదర్శనీయులని పలువురు వక్తలు పేర్కొన్నారు. శని వారం రాత్రి ఆదిశేషయ్య పేరున ఆయన కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులు పదో వార్షిక సంస్మరణ, పురస్కార ప్రదానోత్సవ సభ నిర్వహిం చారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవస్థానం అన్నమయ్య కళా వేదికపై సభ జరిగింది. తొలుత ఆదిశేషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదిశేషయ్య జీవిత విశేషాలను సంగీత విద్వాం సుడు మోదుమూడి సుధాకర్ వివరించారు. అనంతరం భూసురపల్లి ఆదిశే షయ్య కళా పురస్కారాన్ని నాట్యాచార్య కాజ వెంకటసుబ్రహ్మణ్యానికి ఇచ్చి సత్కరించారు. ఆతరువాత శ్రీసాయి మంజీర కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు త్యాగరాజస్వామి రచించిన నౌకా చరిత్ర యక్షగానాన్ని ప్రదర్శిం చారు. సభకు మోదుగుల రవికృష్ణ అధ్యక్షత వహించారు. సభలో రైతు సాధి కార సంస్థ సీఈవో రామారావు, రామరాజు ఫౌండేషన్ అధ్యక్షుడు రామరాజు శ్రీనివాసరావు, దేవస్థానం అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి