అలరించిన సంగీత నృత్యోత్సవాలు
బృందావన గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలోని అన్న మయ్య కళావేదికపై నృత్యోత్సవాలు బుధవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తితిదే దాస సాహిత్య ప్రాజెక్ట్, శ్రీకంచి కామకోటి పీఠ శ్రీవేంకటేశ్వరస్వామి దేవా లయం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ న్యూఢిల్లీ (తిరుపతి రీజియన్), ద్వారం లక్ష్మి అకా డమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ సంయుక్త నిర్వహ ణలో ఈ సంగీత నృత్యోత్సవాలు నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన సభలో తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జీఎస్ఆర్ కృష్ణమూర్తి, దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి పగ డాల ఆనంద తీర్దాచార్యులు, అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, ఇందిరాగాంధీ ఆర్ట్స్ తిరుపతి ఆర్డీ డాక్టర్ కేటీవీ రాఘవన్, ద్వారం లక్ష్మి అకాడమీ నిర్వాహకురాలు డాక్టర్ ద్వారం లక్ష్మి, ఆలయ పాలకమండలి సంయుక్త కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొని సంగీత నృత్యాది కళల పరిరక్షణ గురించి వివరించారు. ఈ సందర్భంగానే ప్రముఖ మృదంగ విద్వాంసురాలు పద్మశ్రీ దండమూడి సుమతీ రామమోహనరావుకు 'మృదంగ నందిని' బిరుదు, కొమ్మాజోస్యుల సద్గురు చరణకు 'తాళావధానపంచావన' బిరుదును ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం భరత కళాక్షేత్ర వారి భరత నాట్య ప్రదర్శన జరిగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి