నేటితరానికి స్ఫూర్తిప్రదాత గిడుగు
వ్యవహార భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతయని సాహితీవేత్త డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి కొనియాడారు. స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీ వేంకటేశ్వర్వసామి వారి దేవాలయం, అన్నమయ్య కళావేదికపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం, సంస్థ వారు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్యలు గిడుగు వెంకట రామ్మూర్తి చిత్రపటానికి పూలమా లలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ టి. రాధాబాయి సభకు అధ్యక్షత వహించారు. డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి మాట్లాడుతూ సమాజహితం కోసం వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టిన మానవ శాస్త్రవేత్త గిడుగు అని పేర్కొన్నారు. సంస్థ కోశాధికారి డాక్టర్ మైలవరపు లలితకుమారి మాట్లాడుతూ నిత్యజీవితంలో మాతృభాష తెలుగు ప్రాధాన్యాన్ని వివరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి