అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
శ్రీలక్ష్మీనృసింహ కవచం అత్యంత పవిత్రం - శ్రీ కె.వి.కోటేశ్వరరావు
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై మంగళవారం శ్రీలక్ష్మీ నృసింహ కవచంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. తొలుత ఆలయ పాలకవర్గం జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కేవీ కోటేశ్వరరావు మాట్లాడుతూ శ్రీలక్ష్మీనృసింహ కవచం దుష్టశక్తులు, దుష్ట కన్నులు, ఇతర ఆటం కాల నుంచి రక్షణ పొందేందుకు పఠించే ఒక శక్తివంతమైన స్తోత్రమని అన్నారు.
.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి