అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు, అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి