అప్పాజోస్యులకు కళావిపంచి పురస్కారం
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆచార్య అప్పాజోస్యుల సత్యనారా యణకు కళావిపంచి వారి తెలుగు వెలుగు ఆత్మీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై కళావిపంచి అధ్యక్షుడు బొప్పన నరసింహారావు ఆధ్వర్యంలో తెలుగు వెలుగు ఆత్మీయ పురస్కార సభ జరిగింది. ఆరాధన ఆర్ట్స్ అకాడమీ, గోవిందరాజులు నాగేశ్వరరావు రచన, నడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించిన పాప దొరికింది హాస్య నాటిక ఆహుతులను అలరించింది. భాగీ శివశంకరశాస్త్రి, డి.తిరుమలేశ్వరరావు, జి. మల్లికార్జునరావు కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళావిపంచి గౌరవాధ్యక్షుడు రామరాజు శ్రీనివాసరావు, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, సాహితీవేత్త కందిమళ్ళ సాంబశివ రావు, సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి, వైస్ ప్రెసిడెంట్ కే.సి.పీ. సిమెంట్ వజ్జా మధుసూదనరావు, ఆలయ పాలకమండలి అధ్య క్షుడు సి.హెచ్.మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, డీ. రామకోటేశ్వరరావు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి