శ్రీమద్భగవద్గీత'పై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై గురువారం శ్రీమద్భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగయోగంపై ఆధ్యాత్మిక ప్రవచనం నిర్వహించారు. బండ్లమూడి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కార్యక్రమం జరగ్గా, ఆలయ పాలకవర్గం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. చిన్మయ మిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రసంగిస్తూ వేదశాస్త్ర పఠనం, పరమేశ్వరుని నామ జప సాధన వంటివి వాక్కుకు సంబంధించిన తప స్సులు అని అన్నారు. తపస్సులను ఫలకాంక్షలేని యోగులు శ్రద్ధతో ఆచరించినప్పుడు, వాటిని తపస్సులుగా పిలుస్తారని శ్రీకృష్ణపరమాత్మ అర్జునుడికి తెలియజేశారని పేర్కొన్నారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి