ఆకట్టుకున్న సంగీత కార్యక్రమాలు
శ్రీమహాదేవు రాధాకృష్ణ రాజు మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రభుత్వ సంగీత, నృత్యపాఠశాల సంయుక్త నిర్వహణలో శనివారం రాత్రి స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదిక మీద జరిగిన సంగీత కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మృదంగ సద్గురువుల సంస్మరణోత్సవాల పేరున కార్యక్రమం నిర్వహించారు. మహాదేవు లక్ష్మీనారాయణరాజు ప్రశిష్య బృందం మృదంగ లయ విన్యాసం అందరి మన్ననలు పొందింది. అనంతరం శాస్త్రీయ సంగీత విభావరిలో జొన్నలగడ్డ సత్యశ్రీరామ్ పలు వాగ్గేయకార కీర్తనలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. కచేరీకి వయోలిన్పై అంబటిపూడి కామాక్షి, మృదంగంపై కుందుర్తి అరవింద్, డోలుపై కె.ఎం. మనోహర్, నాదస్వరంపై కాల్వ ఎంవీ సుబ్బరామయ్య వాద్య సహకారం అందించారు. కార్యక్రమాలను పాఠశాల ప్రిన్సిపాల్ విష్ణుభట్ల కృష్ణవేణి, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆర్. మల్లిఖార్జునరావు పర్యవేక్షించారు. కార్యక్రమం అనంతరం దేవాలయ పాలకవర్గం వారు స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి