భక్తిశ్రద్దలతో చండీహోమం స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ గురువారం చండీహోమం భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతులచే తొమ్మిది మంది వేదపం డితుల నిర్వహణలో గణ పతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీ గణపతి, చండీ హోమాలు నిర్వహించి, పూర్ణాహుతి చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షుడు సిహెచ్. మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శులు ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా స్వామి నగరోత్సవం
శ్రీకృష్ణాష్టమి పండుగ సందర్భంగా శనివారం బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవ స్థానంలో స్వామికి ఆలయ అర్చకులు కృష్ణస్వామి అభిషే కం, అర్చనలు నిర్వహించారు. ఉత్సవమూర్తిని విశేషంగా ఆలంకరించి, మాఢవీధులలో ఊరే గింపు చేపట్టారు. స్వామి ఊంజలసేవ, తీర్థప్రసాద వితరణ జరగ్గా, భక్తులు తరలివచ్చి, స్వామి వారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవాలయ పాలకవర్గం కమిటీ ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి