వివిధ రంగాల్లో నిష్ణాతులకు కళాశ్రీ పురస్కారాలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సృజనాత్మకత, సంస్కృతి సమితి, భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కళాంజలి క్రియేషన్స్ నిర్వహణలో శ్రీ టీవీ జాతీయ కళాశ్రీ పురస్కారాల సభ శుక్రవారం జరిగింది. తొలుత ఆలయ కమిటీ సభ్యులు జ్యోతి ప్రచారణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభకు సంస్థ అధ్యక్షుడు రంగస్థల, సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీ నారాయణ అధ్యక్షత వహించారు. అధితులుగా ఏ.పీ. శిల్పారామములు చైర్మన్ మంజులా రెడ్డి టీవీ నిర్మాత నటులు డాక్టర్ వలేటి అప్పారావు తదితరులు పాల్గొని రంగస్థల నటులు మల్లాది శివన్నారాయణ (రంగస్థల టీవీ రంగం నటులు డాక్టర్ ఆరాధ్యుల కోటేశ్వరరావు (పౌరాణిక నాటక రంగం) డాక్టర్ వి.వి. రాంకుమార్( వైద్యరంగం) ఆలోకం పెద్దబ్బయ్య (ఓసామాజిక, సాంస్కృతిక రంగం) ఏ.వి. సీతా రామయ్య (తెలుగు భాషా రంగం) గాయనిపత్రినిర్మల( కళా రంగం దామచర్ల శ్రీని వాసరావు (సామాజిక, సేవా రంగం సాదినేని మురళీమోహనరావు (విద్యారంగం) లను శ్రీ టీవీ జాతీయ కళాశ్రీ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. సభానంతరం పౌరాణిక నటులు డాక్టర్ ఆరాధ్యుల కోటేశ్వరరావు తమ గాత్రధారులు శ్రీకృష్ణరాయభారంలోని పలు పద్యాలను శ్రావ్యంగా ఆలపించి ప్రేక్షకులను అలరింప చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి