అలరించిన శ్రీకృష్ణ భక్తి గీతాలాపన
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవాలయం పద్మావతీ కల్యాణ వేదికపై గురువారం శ్రీకృష్ణ భక్తి గీతాలాపన నిర్వహించారు. భక్త నారద ఆధ్వర్యంలో గానసభజరగ్గా, ఆలయ పాలకవర్గ కమిటీ జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. ముఖ్యఅతిథు లుగా హాజరైన ఏపీ విశ్రాంత డీజీపీ ఎం. మాలకొండయ్య, కాళహస్తి సత్యనా రాయణలు మాట్లాడారు. అనంతరం సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు డాక్టర్ ఆకురాతి కోదండరామయ్య గీతాలను ఆలపించారు. ఆలోకమే శ్రీబాలకృష్ణం సతులాల చూడరే, రాధాసమేత కృష్ణ, లీలా శ్రీకృష్ణయ్య, ముద్దుగారే యశోద, సామజవరగమన, జోఅచ్యుతానంద జోజో ముకుందా తదితర కృష్ణ భక్తిగీతాలు అలరించాయి. వయోలిన్పై డాక్టర్ ఆంజనేయశాస్త్రి, తబలాపై బాలాజీ వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి