ఆకట్టుకున్న శ్రీరామాంజనేయ యుద్ధం సన్నివేశం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ అన్నమయ్య కళావేదికపై గురువారం పి.వి.శంకరరావు సౌజన్యంతో శ్రీ రామానాట్యామండలి, యనమదల వారిచే శ్రీరామాంజనేయ యుద్ధం వార్సీన్ పద్యనాటకం ఆహుతులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ పాలకమండలి, అతిథులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీరాముడుగా బిళ్ళా జాన్బాబు, ఆంజనేయుడుగా వెనిగళ్ళ బ్రహ్మం చక్కటి హావభావాలతో పద్యాలను ఆలపించి వార్సీను ఘట్టాన్ని రక్తికట్టించారు. వీరికి హార్మోనియంపై పి. సురేష్, క్లారినట్పై వి. వెంకటరావు, డోలక్పై శ్రీనివాస్, మేకప్ పి.రాము చక్కటి సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం కళాకారులను పి.వి. శంకరరావు ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి