కళాకారులకు ఘన సత్కారం
స్థానిక బృందావన్ గార్డెన్స్, శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆది వారం గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ వారి కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలకవర్గం, సంస్థ వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాధామాధవ రసరంజని నాట్యా చార్య ఎస్కే ఖలీల్ శిష్యబృందంచే గణపతి నృత్యం, నారాయణ నారాయణ గోవింద హరే, డూడూ బసవన్న, ఓం శివోహం, పలికే బంగారుతల్లిరో మా యల్లమ్మ అంటూ పలు జానపద, కూచి పూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. అనం తరం గుళ్ళపల్లి సుబ్బారావు నాట్యాచార్య ఖలీల్, శిష్యబృందాన్ని సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి