అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత కచేరి నిర్వహించారు. కీర్తన ఆర్ట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు(హైదరా బాద్) విద్వాన్ డాక్టర్ కమలారమణి శాస్త్రీయ సం గీత కచేరి, డాక్టర్ ఎం.శ్రీధర్, కీర్తన ట్రస్ట్ అధ్యక్షులు ఎం.విజయలక్ష్మి, డాక్టర్ ఎం. సుమిత్ర, ఆలయ పాలకమండలి నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. త్యాగరాజ కీర్తనలు, వాగ్గేయకార కృతులను కమలారమణి శ్రావ్యంగా గానం చేశారు. వయోలిన్పై పి.నం దకుమార్, మృదంగంపై బి.సురేష్ బాబు వాయిద్యాన్ని అందించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎంవై శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం. రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబం డ్ల లలితాదేవి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, కోశా ధికారి విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను అతి థులను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి