అలరించిన వేణుగానం, గాత్ర కచేరి స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణవేదికపై ఆదివారం వేణుగానం, గాత్ర కచేరి నిర్వహించారు. స్వర తరంగిణి విద్యాల యం(గుంటూరు) ఆధ్వర్యంలో ఆలయ పాలకమండలి, సంస్థ నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. శ్రీమారెళ్ళ వామనకుమార్ పలు కీర్తనలను వేణు గానంతో పలికించారు. ప్రేక్షకులను అలరించాయి. సువర్ణవిద్య శిష్య బృందం వాగ్గేయకార కీర్తనలను అలపించారు. వయోలిన్‌పై చావలి శ్రీనివాస్, మృదంగంపై చావలి కృష్ణమోహన్ వాయిద్యాన్ని అందించారు.
భక్తిశ్రద్ధలతో చండీహోమం
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణంలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి విశ్వశాంతిని కాంక్షిస్తూ చండీహోమం నిర్వహించారు. పరిషత్ వ్యవస్థాపకుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంపతుల నిర్వహణలో 9 మంది వేదపండితులు.. గణపతి, మహాశివలింగం, నవగ్రహాలకు అభిషేకాలు, అర్చనలు చేశారు. రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. ఆలయ పాలకమండలి అధ్యక్షుడు చిటిపోతు మస్తానయ్య, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి