ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు - 08.11.2025

అలరించిన లక్ష్మీనరసింహదాసు కీర్తనలు స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనల సోదాహరణ పూర్వక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. గాన విద్యాప్రవీణ విద్వాన్ ఆకొండి శ్రీని వాస రాజారావు, తూము లక్ష్మీనరసింహదాసు కీర్తనలకు సోదాహరణ పూర్వక వివరణతో శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై బీరక సురేష్ బాబుల వాయిద్యాన్ని అందించారు. సంస్థ ఉపాధ్యక్షురాలు మాధవపెద్ది మీనాక్షి, ముఖ్య అతిథి పూర్వ ప్రధానాచార్యులు, హిం దూ కళాశాల గుంటూరు, సాహితీ రత్నాకర డాక్టర్ దీవి నరసింహ దీక్షిత్, ఆత్మీయ అతిథి డాక్టర్ సి. జ్యోతి కాంప్రసాద్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యఅతిథి మాట్లాడుతూ తూము లక్ష్మీనరసింహ దాసు వాగ్గేయకారులలోని అనేక విశేషార్థాలను వివరిస్తూ ఇటువంటి కార్యక్రామాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజరాజేశ్వరి, లలిత దేవి, మీనాక్షి, కార్యదర్శి ఏవీ మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను సత్కరించారు.

శృంగారనైషదంపై ఆధ్యాత్మిక ప్రవచనం - 08,09.09.2025

శృంగారనైషదంపై ఆధ్యాత్మిక ప్రవచనం

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై మంగళవారం శృంగారనైషధంలోని నలదమయంతుల చరిత్రపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమం డలి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డా. కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ, నలుడు ధైర్యశాలి. గుర్రపు స్వారీలో నిష్ణాతుడు. దాతృత్వ గుణం కలవాడన్నారు. దమయంతి సౌందర్యవతి, బుద్ధిశాలి, దైవభక్తి, పతివ్రత అన్నారు. ఈ ఇద్దరూ తమ సద్గుణాలతో ఒకరినొకరు ఆకర్షించుకొని, ప్రేమ బంధంతో కలిశారన్నారు. ఇద్దరి గుణగణాలు, సద్గుణాలు వారిని ఒకరి పట్ల ఒకరిని ఆకర్షించాయని, దమయంతి నలుని గుణగణాలను విని, అతని పట్ల ప్రేమను పెంచుకుందన్నారు. నలుడు కూడా దమయంతి సౌందర్యం, గుణగణాలను విని ఆమెను ఇష్టపడ్డారని శృంగార నైషధం కావ్య విశిష్టతను తెలియజేశారు.









కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.