లక్ష్మీదేవి వైభవంపై ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ ఆలయ ప్రాంగణం వేంకటేశ్వర స్వామి అన్నమయ్య కళావేదికపై శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవి 준길 ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ పాలక వర్గం వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కోగంటి వేంకట శ్రీరంగనాయకి ప్రవచిస్తూ శ్రావణ శుక్రవారం నాడు జరుపుకునే వరలక్ష్మీ వ్రతం, హిందూ సాంప్రదాయంలో స్త్రీలకు ఎంతో ముఖ్యమైన పండుగన్నారు. వరలక్ష్మీ దేవిని పూజించడం వల్ల అష్టశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలుగుతాయని నమ్ముతారన్నారు. ముఖ్యంగా వివాహిత మహిళలు తమ భర్తల సౌభాగ్యం కోసం, కుటుంబ సభ్యుల సుఖం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారన్నారు. శ్రావణ శుక్రవారం దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమన్నారు. ఈ దేవతను పూజిస్తే అష్టశ్వర్యాలు సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం, శక్తి లభిస్తాయని భక్తుల విశ్వాసం అన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి