ఆకట్టుకున్న భక్త అంబరీష హరికథా గానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శ్రీ ఆదిభట్ల నారాయణదాస కథాగాన కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ నారాయణ దాస 161వ జయంతోత్సవాలు ఆదివారం ముగిశాయి. సప్పా భారతిచే భక్త అంబరీష హరికథాగానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. సప్పా భారతి హరికథను ప్రారంభిస్తూ శ్రీమన్నారాయణుడి పట్ల అతని అచంచలమైన భక్తి, ఏకాదశీ వ్రత మహత్యం, అతిథి దేవుడు అయిన దుర్వాస మహాముని పట్ల అతని సహనం, గౌరవం చుట్టూ తిరు గుతుందన్నారు. వీరికి మృదంగంపై జగన్మోహిని, వయోలిన్‌పై చావలి శ్రీనివాస్ చక్కటి వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి