హరిత విప్లవ సాధనకు స్వామినాథన్ ఎనలేని కృషి
హరిత విప్లవ సాధనకు స్వామినాథన్ ఎనలేని కృషి చేశారని వక్తలు కొనియాడారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణం పద్మావతి కల్యాణ వేదికపై గురువారం భారతరత్న ఎంఎస్.స్వామి నాథ్ శత జయంతి వేడుకలను గుంటూరు జిల్లా సీనియర్ సిటిజన్స్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ పాలకమం డలి నిర్వాహకులు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సంస్థ అధ్యక్షులు మన్నె సుబ్బారావు ప్రసంగిస్తూ ఎం.ఎస్.స్వామినాథన్ గ్రీన్ రివల్యూషన్ ప్రణాళికలు, కృషి క్షేత్రం ఆధునికీకరణలో పెద్ద పాత్ర పోషించారని తెలిపారు. హరిత విప్లవ సాధనకు ఎనలేని కృషి చేశారని వివరించారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా స్వామినాథన్ జీవిత విశేషాలను ప్రదర్శించారు.







కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి