భక్తిశ్రద్ధలతో చండీ హోమం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ధార్మిక ప్రాంగణం లో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ ఆధ్వర్యంలో పౌర్ణమి, దత్త జయంతి సందర్భంగా గురు వారం చండీ హోమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బొల్లేపల్లి సత్యనారాయణ లలితాంబ దంపతులు తొమ్మిది మంది వేదపండితుల నిర్వహణలో గణపతికి, శివలింగానికి, నవ గ్రహాలకు విశేష అభిషేకాలు, అర్చనలు, రుద్ర, లక్ష్మీగణపతి, చండీ హోమాలు నిర్వహించి పూర్ణాహుతి చేశారు. కాంటినెంటల్ కాఫీ అధినేత చల్లా రాజేంద్రప్రసాద్, ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య పాల్గొన్నారు.
ఆకట్టుకున్న హనుమ సందేశం హరికథాగానం
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వరస్వామి దేవాలయంలోని పద్మావతి కల్యాణ వేదికపై శుక్రవారం రాత్రి ఆదిభట్ల నారాయణదాస కథాగాన కళాపరిషత్ ఆధ్వర్యంలో నారాయణదాసు జయంత్యుత్సవాలు జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా డాక్టర్ ముప్పవరపు సింహాచలశాస్త్రి 'హనుమ సందేశం' అనే అంశంపై హరికథాగానం చేశారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి