ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

హరిహరాత్మకమైనది కార్తీకం - 19.11.2025

హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ  శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.

శ్రీకృష్ణ తత్త్వంపై ప్రవచనం - 05, 06.08.2025

శ్రీకృష్ణ తత్త్వంపై ప్రవచనం

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం శ్రీకృష్ణ త్వత్తముపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త మల్లాది కైలాసనాథ్ ప్రవచిస్తూ అన్ని అవతారములలోకి శ్రీకృష్ణావతారము అత్యంత మాధుర్య భరితమైనదన్నారు. కృష్ణుడు అనగా ఆకర్షించేవాడని అర్ధమన్నారు. భగవంతుడు జీవులను ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాడన్నారు. కృష్ణపరమాత్మ బాల్యంలో అనేక లీలలను చూపించాడన్నారు.ఈ లీలలను జాగ్రత్తగా పరశీలించినచో వాటిలో చక్కటి అంతరార్ధము, త్వత్తము, సందేశము మనకు బోధపడుతుందన్నారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం అని వ్యా సమహర్షి అన్నారని తెలిపారు.








కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన - 25.10.2025

ఆకట్టుకున్న కూచిపూడి నృత్యప్రదర్శన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం పద్మావతి కళ్యాణవేదికపై శనివారం కూచిపూడి నృత్యప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తొలుత నూజివీడు సీడ్స్ చైర్మన్ కారుమంచి ప్రసాద్, ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్రాంత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ కుమారి చదలవాడ వేంకట రమణి, నాట్యకిరణం కూడిపూడి నృత్య అకాడమి హైదరాబాద్ నాట్యాచారిణి మిద్దె కిరణ్మయి మరియు బృందం కూచిపూడి నృత్యాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కార్యక్రమాన్ని కీ.శే. శ్రీమతి చదలవాడ శారద సత్యనారాయణ జ్ఞాపకార్ధం కార్యక్రమాన్ని చదలవాడ వేంకట రమణి నిర్వహించారు.

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ - 17.07.2025

వైభవంగా శ్రీవారికి తిరుప్పావడసేవ  స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయంలో బుధవారం శ్రీవారికి అత్యంత వైభవోపేతంగా తిరుప్పావడసేవ కార్యక్రమం జరిగింది. తొలుత వేదపండితులు మాధవస్వామి బృందం ఆధ్వర్యంలో స్వామి ఉత్సవమూర్తులకు విశేష అర్చనలు, అభిషేకాలు, అలంకరణ జరిగాయి. స్వామి దివ్యదృష్టి పడే విధంగా మహామండపంలో పెద్ది శ్రీనివాసరావు, శ్రీలత దంపతులు సమర్పించిన మేల్‌చాట్ వస్త్రం, చిత్రాన్న రాశిలో జిలేబి, వడ, అప్పాలు, లడ్డులు, దోశలులను ఒక దీర్ఘ చతురస్రాకారంగా 18 అంగుళాల ఎత్తున ఏర్పాటు చేశారు. అష్టదిక్కులు, ఆరాధనలు జరిపి వివిధ రకాల పూలమాలతో తిరుప్పావడపై అలంకరించారు. వేదపండితుల ఆధ్వర్యంలో శ్రీనివాస గద్యాన్ని శ్రవణానందంగా పఠించారు. అధిక సంఖ్యలో భక్తులు తిరుప్పావడ సేవలో పాల్గొన్నారు. ఆలయ పాలకమండలి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, పుట్టగుంట ప్రభాకరరావు, సభ్యులు, భారతీధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షులు బొల్లేపల్లి సత్యనారాయణ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు - 10.01.2025

ఉత్తరద్వారంలో స్వామిని దర్శించుకున్న భక్తులు  ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని నగరంలోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఆలంకరించిన ఆసనంపై స్వామి ఉత్సవమూర్తులను ఉత్తరద్వారం ఎదురుగా ఏర్పాటు చేశారు. మూలవిరాట్‌లకు విశేష అభిషేకాలు , ప్రత్యేక పూజలు , అలంకరణ జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శనానికి బారులుతీరారు. స్వామిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించి పూజలు నిర్వహించారు. అధికసంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు.