హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
ఆకట్టుకున్న పాదుకా పట్టాభిషేకం హరికథాగానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలోని పద్మావతి కళ్యాణవేదికపై శ్రీ ఆదిభట్ల నారాయణదాస కథాగా కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీ నారాయణదాస 161వ జయంతోత్సవాలు జరిగాయి. ఇందులో భాగంగా గురువారం సువర్ణ హస్త కంకణ గ్రహీత విజయకుమారి భాగవతారిణి వారిచే పాదుకాపట్టాభిషేకంపై జరిగిన హరికథాగానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటీ, సంస్థ వారు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయకుమారి హరికథాగానం రూపంలో భక్తులకు రామయణాన్ని వివరించారు.


కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి