శ్రీనివాసరావుకు పురస్కార ప్రదానం
నాటక రంగంలో బాలచంద్రరావు కృషి చిరస్మర ణీయమని పలువురు కొనియా డారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై బాలచంద్ర ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ రంగస్థల నటుడు మంచా బాలచంద్రరావు పంచమ వర్ధంతి, స్మారక పురస్కార సభ సోమవారం రాత్రి జరిగింది. సభకు రంగస్థల నటుడు, దర్శకుడు ఎంవీఎల్ నరసింహారావు అధ్యక్షత వహించారు. సభలో రంగస్థల ప్రముఖులు కావూరి సత్యనారాయణ, డాక్టర్ ఆలపాటి అనూరాధ, షేక్ సైదా, సంస్థ కోశాధికారి మంచా కృష్ణమోహన్, ఎం. గణేష్, ఎల్. శంకర్, చింతల ఆనంద్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా రంగస్థల నటుడు, హార్మోనిస్టు గుర్రపుశాల శ్రీనివాసరావును బాలచంద్రరావు స్మారక పురస్కారంతో సత్కరించారు. అనంతరం ప్రదర్శిం చిన సత్యహరిశ్చంద్ర నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి