సంగీతరంగ ప్రముఖులకు సత్కారాలు
గుంటూరు బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగ ణంలోని అన్నమయ్య కళావేదికపై పలువురు సంగీత రంగ ప్రముఖులను సత్కరించారు. తితిదే దాస సాహిత్య ప్రాజెక్ట్, శ్రీకంచి కామకోటి పీఠ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, ద్వారం లక్ష్మి అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్ సంయుక్త నిర్వహణలో ఆదివారం రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. ద్వారం భావనారాయణరావు మెమోరియల్ ట్రస్ట్ పక్షాన సంగీత విద్వాంసులు పద్మశ్రీ అన్నవరపు రామస్వామి, భమిడి కమలా దేవి, డాక్టర్ గుడిపాటి లలితను సంగీత విద్యాశిరోమణి పుర స్కారాలతో సత్కరించారు. ధనకుధరం సీతారామానుజాచార్య స్వామి, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్. మస్తా నయ్య, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కేటీవీ రాఘవన్ తదితరులు పాల్గొన్నారు. అతి థులను ద్వారం లక్ష్మి, వెంకటరమణ దంపతులు సత్కరిం చారు అనంతరం హంసధ్వని నృత్యాలయం నాట్యాచార్య సీహెచ్. శ్రీనివాస్ బృందం నారాయణీయం కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శితమైంది. దాస సాహిత్య ప్రాజెక్ట్ భజనమం డలి వారి కోలాటాలు, భజనలు జరిగాయి.



.jpeg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి