అలరించిన శ్రీరామ జననం హరికథా గానం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కళ్యాణ వేదికపై శ్రీ నారాయణ దాస జయంతోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదిభట్ల నారాయణదాస కథాకరణ కళాపరిషత్ వారి ఆధ్వర్యంలో చేపట్టగా, మంగళవారం హరికథాగానం నిర్వహించారు. ఆలయ కమిటీ, సంస్థ నిర్వాహకులు జ్యోతిప్రజ్వలనతో ప్రారంభించారు. పురాణం విజయలక్ష్మి (కొవ్వూరు) మాట్లాడుతూ శ్రీరామ జననం ఇతివృత్తం అంటే త్రేతాయుగంలో అయోధ్యలో రాముని జన్మించిన కథ అన్నారు. శ్రీరాముడు ధర్మాన్ని స్థాపించేందుకు, దుష్టశక్తులను సంహరించేందుకు విష్ణువు అవతారంగా జన్మించాడని పేర్కొన్నారు. అనంతరం సంస్థ నిర్వాహకులు డాక్టర్ రాజ్యలక్ష్మి, కర్రా సూర్యనారాయణదాస్ పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి