అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళా వేదికపై జరుగుతున్న సంగీత నృత్య కార్యక్రమాలు అలరిస్తున్నాయి. తొలుత ఆలయ పాలకమండలి జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్రాంత ప్రిన్సిపల్ హిందూ కళాశాల డాక్టర్ దీవి నరసింహ దీక్షితుల వారిచే నారాయణ తీర్థులు ప్రబోధించిన నమ సంప్రయోగ వైభవంపై ప్రసంగించారు. అనంతరం తిరుపతికి చెందిన కళారత్న డాక్టర్ ద్వారం లక్ష్మి సంగీత కచేరి రసభరితంగా సాగీ శ్రోతలను అలరించింది. వారికి వయోలిన్పై పెరవలి నందకుమార్, మృదంగంపై కె.సద్గురుచరణ్, ఘటంపై శ్రీహరిబాబు వాయిద్య సహకారం అందించారు.
.jpeg)

.jpeg)

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి