తెలుగు సాహిత్యంలో అద్వితీయమైన ప్రక్రియ హరికథ
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వ రస్వామి దేవా లయం అన్నమయ్య కళావేదికపై శ్రీఆది భట్ల నారాయణ దాస కథాకరణ కళాపరిషత్ ఆధ్వర్యంలో శ్రీనారాయణ దాస జయంతోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సభ్యులు, సంస్థ నిర్వాహ కులు జ్యోతి ప్రజ్వలన చేశారు. డాక్టర్ ఉప ద్రష్ట వెంకటరమణమూర్తి ప్రసంగిస్తూ ఆది భట్ల నారాయణదాసు తన సాహితీ వైభవాన్ని హరికథకు పునాది వేశారని అన్నారు. ఆయన సంగీతం, సాహిత్యం, నృత్యాలను మేళవించారని పేర్కొన్నారు. తెలుగు సాహిత్యంలో ఆయన సృష్టించిన హరికథ ప్రక్రియ అద్వితీయమైనదన్నారు. ఆయన ప్రతిభకు, వైభవానికి నిదర్శనమని అన్నారు. కార్యక్ర మాన్ని కర్రా సూర్యనారాయణదాస్ పర్యవేక్షించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి