అలరించిన శాస్త్రీయ సంగీత కచేరి
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ప్రాంగణంలో అన్నమయ్య కళావేదికపై దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ కంచి కామకోటి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ న్యూఢిల్లీ (తిరుపతి రీజియన్), ద్వారం లక్ష్మి అకాడమీ ఫర్ మ్యూజికల్ సర్వీసెస్, తిరుపతి వారి సంయుక్త నిర్వహణలో సంగీత నృత్యోత్సవాలలో భాగంగా శుక్రవారం జరిగిన శాస్త్రీయ సంగీత కచేరి ప్రేక్షకులను అలరింపజేసింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు ఎం అంజనా సుధాకర్ బృందం, మోదుమూడి సుధాకర్ లు తమ గాత్రధారణలో పలువురు వాగ్గేయకారుల కీర్తనలను శ్రావ్యంగా ఆలపించారు. వయోలిన్పై పి. నందకుమార్, మృదంగంపై కే కార్తికేయ ఆదినారాయణ శర్మ వాయిద్య సహకారం అందించారు. ఈ సందర్భంగా కళాకారులను సంస్థ కార్యదర్శి వెంకటరమణ ఘనంగా సత్కరించారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి