అలరించిన తాళం భజన స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సాయిమారుతి భజన మండలి, గుంటూరు వారిచే తాళంభజన కార్యక్రమం ప్రేక్షకులను అలరించింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వి. మల్లేశ్వరరావు బృందం తమ గాత్ర ధారణలో ఓ గణనాథ, జయ గణనాధ, విఠల విఠల పాహిమాం, హరహర మహాదేవ, ఓం సాయి శ్రీసాయి అంటూ పలు భక్తి గీతాలను తాళంభజన రూపంలో చక్కగా ఆలపించి ఆహుతులను ఆకట్టుకున్నారు. తబలపై రమణ, కీబోర్డుపై సాయి వాయిద్యసహకారం అందించారు.
సుబ్బారావు సేవలు ప్రశంసనీయం
రెండున్నర దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక, విద్య, కళా సాంస్కృతిక రంగాలకు భారీ విరాళాలందిస్తున్న గుళ్లపల్లి సుబ్బారావు సేవలు అభినందనీయమని బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు అన్నారు. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సోమ వారం రాత్రి సేవా సంస్థ వ్యవస్థాపకుడు గుళ్లపల్లి సుబ్బారావును పలువురు ఘనంగా సన్మానిం చారు. సన్మాన గ్రహీత సుబ్బారావు మాట్లాడారు.


కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి