ఆకట్టుకున్న వాగ్గేయకార సంకీర్తనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం శ్రీ అవధూతేంద్ర భక్తబృందం, గుంటూరు వారి వాగ్గేయకార సంకీర్తన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీహరి శరణ్ మహరాజ్ బృందంచే జయజయ గణనాయక, జయగురు జయగురు సశ్చిదానంద గురు, హరేరామ హరేరామ రామరామ హరేహరే అంటూ పలు వాగ్గేయకార కీర్తనలను ఆలపించి కీర్తనల యొక్క సారాంశాన్ని చక్కగా ప్రవచన రూపంలో వివరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరికి డోలక్‌పై షణ్ముక వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం సంకీర్తనబృందాన్ని సత్కరించి, స్వామివారి ప్రసాదాలను అందజేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి