ఆకట్టుకున్న తాళం భజన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం శ్రీ సిద్ది విఘ్నేశ్వర భజన సమాజం, గోగులమూడి వారి తాళం భజన కార్యక్రమం జరిగింది. తొలుత ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వై. భాస్కరరావు బృందంచే జయ జయ వినాయక, కస్తూరి తిలకం నారాయణం, కౌశల్య సుప్రజ రామచంద్ర సీతామనోహర రామచంద్ర అంటూ పలు వాగ్గేయకార కీర్తనలును తాళంభజన రూపంలో ఆలపించి ప్రేక్షకులను అలరించారు. ఆలయ కమిటి సభ్యులు కన్నెగంటి బుచ్చయ్యచౌదరి సౌజన్య సహకారం అందించారు. వీరికి హార్మోనియంపై శ్రీనివాస్, డోలక్‌పై శ్రీనివాస లు వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమం అనంతరం భజన బృందానికి పాలకవర్గం వారి ఘనంగా సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి