దైవాసుర సంపద్విభాగ యోగంపై ప్రవచనాలు
బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ప్రాంగణం కళావేదికపై ఆలయ అన్నమయ్య జరుగుల బంగారుబాబు, శివకుమారిల సౌజన్యంతో శ్రీమద్భగవద్గీత 16వ అధ్యాయం దైవాసుర సంపద్విభాగ యోగంపై ఆధ్యాత్మిక ప్రవచనాలు శుక్రవారంతో ముగిశాయి. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్మయామిషన్ బ్రహ్మచారి సువీరానందస్వామి ప్రవచిస్తూ మానవ జీవితంలో మంచి, చెడుల మధ్య పోరాటాన్ని, దేవుడిని చేరుకోవడానికి దైవిక లక్షణాలను అలవర్చుకోవలసిన అవసరాన్ని ఈ అధ్యాయం నొక్కి చెబుతుందన్నారు. మానవ జీవితంలో మంచి, చెడుల మధ్య పోరాటాన్ని, వాటి పరిణామాలను వివరిస్తుందన్నారు. దైవిక లక్షణాలను అలవరచుకోవడం ద్వారా, ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించగలదని, అసుర లక్షణాలను విడిచిపెట్టడం ద్వారా బంధ విముక్తిని పొందగలడని ఈ అధ్యాయం బోధిస్తుందన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి