ఆకట్టుకున్నకూచిపూడి నృత్యప్రదర్శన
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆదివారం ప్రదర్శించిన నృత్యకిన్నెర, హైదరాబాద్ వారి కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సభ్యులు, సంస్థవారు జ్యోతిప్ర జ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు, హంస అవార్డు గ్రహీత గురు డాక్టర్ మద్దాలి ఉషాగాయత్రి శిష్యబృందం యశస్వినిశ్రీ, శ్రద్ధ వారణాసి,సహస్ర, చెరిష్య, కార్తీక, ప్రణీత, చాతుర్యశ్రీ లు వినరో భాగ్యము విష్ణుకథతో ప్రారంభించి శ్రీమన్నారాయణ, నారాయణతే నమో నమో పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించి రసజ్ఞులను ఆకట్టుకున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి