డాక్టర్ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం ప్రదానం
స్థానిక బృందావన్గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై శనివారం గాయత్రీ మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో గానకళానిధి వింజమూరి వరదరాజ అయ్యంగార్ జయంతి సం గీత వేడుకలు నిర్వహించారు. వింజమూరి సం ధ్య (చెన్నై), త్యాగరాజ సాంస్కృతిక సంఘం ఉపాధ్యక్షులు ఎస్.గిరిజాశంకర్, కార్యదర్శి వల్లూరి కష్ణకిషోర్, ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయవాబు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. సభకు సన్మండలి ఉపాధ్యక్షు రాలు డాక్టర్ ఎం.రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు. ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసులు విద్వాన్ ఏఎస్ మురళి (చెన్నై)కి డాక్టర్ వింజమూరి వరదరాజ అయ్యంగార్ మెమోరియల్ పురస్కారం అందించి సత్కరించారు. సభానంతరం ఏఎస్ మురళి శాస్త్రీయ సంగీత కచేరి అలరించింది. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎం.వై.శేషురాణి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం.రాజరాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ్ల లలితాదేవి, కార్యదర్శి ఏ.వీ.మంగాదేవి, కోశాధికారి విజయలక్ష్మి పాల్గొనగా, కళాకారులను అతిథు లను సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి