ఘనంగా వ్యాసపౌర్ణమి వేడుకలు
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వారి ఆధ్వర్యంలో గురువారం వ్యాసపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ఆధ్వర్యంలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకూర్మనాథస్వామి ప్రసంగిస్తూ వేదాలను నాలుగు భాగాలుగా విభజించి, వాటిని అధ్యయనం చేయడం సులభతరం చేసిన మహారుషి వేదవ్యాసులన్నారు. 18 పురాణాలను పంచమవేదమైన మహాభారతాన్ని, భాగవతం వంటి ఎన్నో పురాణాల కథలను రచించి సాహిత్యం మరియు ఆధ్యాత్మిక రంగానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఆషాఢ పౌర్ణమిని గురుపౌర్ణమిగా వ్యాస భగవానుడిని పూజించడం ఆనవాయితీగా వస్తుందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి