హరిహరాత్మకమైనది కార్తీకం కార్తీకమాసం హరి , హరనామ స్మరణకు అత్యంత విశిష్టమైనదని ప్రముఖ సాహితీవేత్త సారస్వత కళానిధి డాక్టర్ వెలువోలు నాగరాజ్యలక్ష్మి అన్నారు. బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం ముకుందమాలపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ నాగరాజ్యలక్ష్మి ప్రవచనం చేస్తూ శివ , కేశవ నామాలు రెండు పవిత్రమైనవని , ఏ నామాన్ని జపించిన జీవుడు సద్గతిని పొందగలడని వివరిస్తూ సంస్కృతంతో స్తోత్ర రాజంగా పేరు పొందిన కులశేఖరాళ్వారులవారి ముకుందమాల స్తోత్రంలోని భక్తి తత్పరతను సోదాహరణంగా వివరించారు.
సామాజిక సంక్షేమానికి హోమాలు - భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్
బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని యాగశాలలో భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, లలితాంబ దంప తుల ఆధ్వర్యంలో ఆదివారం విశేష హోమాలు జరిగాయి. తొలి ఏకాదశి సందర్భంగా సామాజిక సంక్షేమం కోసం 15 మంది రుత్వికులు లక్ష్మీగణపతి, చండి, రుద్ర హోమాలు చేశారు. చివరగా పూర్ణా హుతి నిర్వహించారు. ఈ క్రతువులో కాకాని తహసీల్దార్ కృష్ణకాంత్ దంపతులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి