ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం - పూజ్యశ్రీ కె.వి. కోటేశ్వరరావు - 08,09.07.2026

కృష్ణలీలా వైభవ వర్ణణ నిధి గోవిందాష్టకం స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయం అన్నమయ్య కళావేదికపై బుధవారం శ్రీగోవిందాష్టకమ్ పై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయకమిటి అధ్యక్షులు సీహెచ్. మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచిస్తూ  గోవిందాష్టకమ్ అనేది జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శ్రీకృష్ణుడిని స్తుతిస్తూ రచించిన ఒక అత్యంత మధురమైన , భక్తిరస పూరితమైన స్తోత్రమన్నారు. ఎనిమిది శ్లోకాలతో కూడిన ఈ అష్టకంలో శ్రీకృష్ణుని లీలలు , ఆయన దివ్య మంగళ స్వరూపం , పరమాత్మ తత్త్వం అద్భుతంగా వర్ణించబడ్డాయన్నారు. శంకరాచార్యుల వారు ఈ స్తోత్రంలో కృష్ణుడిని కేవలం ఒక గోపాలకుడిగా మాత్రమే కాకుండా , సృష్టి-స్థితి-లయ కారకుడైన పరబ్రహ్మ స్వరూపంగా కొనియాడారన్నారు.

ఆకట్టుకున్నకూచిపూడి నృత్యప్రదర్శన - 05.07.2025

ఆకట్టుకున్నకూచిపూడి నృత్యప్రదర్శన

స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శనివారం ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు, విద్యావేత్త నూతలపాటి తిరుపతయ్య తదితరులు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ప్రముఖ నాట్యా చార్యుడు, వేదాంతం సత్యనారసింహ శాస్త్ర నాట్యా చార్యుడు, వేదాంతం సత్యనార సింహ శిష్యబృందం సాయిశరణ్య శ్రీవైష్ణవి, శ్రీజా వైష్ణవి లు వినాయక కౌతంతో ప్రారంభించి కృష్ణశబ్దం, బృందావన నిలయం, సావిరహే,వినరో భాగ్యము, బాలగోపాల తరంగం, మరకత మణిచేల పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమాన్ని ఎ.వి.బ్రహ్మాజి పర్యవేక్షించారు.









కామెంట్‌లు