బహుముఖ ప్రజ్ఞాశాలి : పింగళి వెంకయ్య
స్వాతంత్య్ర సమరయోధుడిగా, ఉపన్యాసకుడిగా, జాతీయ జెండా రూపకల్ప శిల్పిగా పేరుగాంచిన గొప్ప వ్యక్తి పింగళి వెంకయ్య అని పలువురు కొనియాడారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై శుక్రవారం నటనాలయ అధ్యక్షులు నీలం మందారావు ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య సంస్మరణ సభ జరిగింది. కార్యక్రమంలో కె.వి. రామారావు ఆహ్వానం పలుకగా, రంగస్థల ఆచార్యులు డాక్టర్ జి.యన్. ప్రసాద్ రెడ్డి అధ్యక్షత వహించారు. ప్రముఖ దర్శకులు పి. శివప్రసాద్, సీఐడీ డీఎస్పీ గోలి లక్ష్మయ్య, రచయిత సీఎన్.మూర్తి, నటులు కె. అనంతహృదయాజ్, సీహెచ్ నాయుడు, ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య, సినీ దర్శకుడు ఎం.గౌత మ్, విద్యావేత్త పి. శశికుమార్ పాల్గొని పింగళి వెంకయ్య సేవలను కొనియాడారు. సభానంతరం డాక్టర్ పీర్. కుమార్ భద్రి రచించిన నెల్లూరు సుధాకర్ దర్శకత్వంలో వంశవృక్షం నాటిక సందేశాత్మకంగా సాగింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి