వారాహి స్తుతి సర్వరక్షా కవచం
వారాహి అమ్మవారిని స్తుతి సర్వరక్షా కౌచం వంటిదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు కె.వి. కోటేశ్వరరావు అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికగా బుధవారం వారాహి వైభవం అనే అంశంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి ఉపాధ్యక్షులు లంకా విజయబాబు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు, సుందర సత్సంగ్ సభ్యులు మన్నవ రవిప్రసాద్, పీ. శివారెడ్డి, ఏకాంబరేశ్వరరావు, బసవేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుందర సత్సంగ్ సభ్యులు కె.వి. కోటేశ్వరరావు ప్రవచనం చేస్తూ సర్వవ్యాపకుడు, శక్తిమంతుడు, సర్వజ్ఞుడు ఐన భగవంతుడు, ధర్మానికి హాని కలిగి అధర్మం ప్రజ్వరిల్లినపుడు తనంతట తానుగా ధర్మ రక్షణ కోసం అవతరిస్తారన్నారు. రాక్ష సంహారం కోసం భగవంతుడు అనేక రూపాలలో ఆవిర్భవిస్తారన్నారు. ఆలా ఆవిర్భవించినప్పుడు అవతారానికి తగిన నామము, యంత్రము, తత్వజ్ఞానము, మోక్షము సాధకులకు అనుగ్రహిస్తారన్నారు. మనిషి రాక్షసుడుగా ఎందుకు మారతాడు అంటే పొందిన వరాలను దుర్వినియోగం చేసుకొని, సమాజానికి కంటకంగా మారి అశాంతి నెలకొన్నప్పుడు సరిచేయటం భగవంతుని విధి అన్నారు. లలిత పరమేశ్వరి, శ్యామల వారాహి రూపాలలో అవతరించి సంహరించారన్నారు. వారాహి మాత రక్షణ శక్తిగా అవతరించి దేవతలా భయాన్ని హరించిందన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి