అలరించిన కదంబ కార్యక్రమం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై రాష్ర్ట సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా విభాగం వారి ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన కదంబ కార్యక్రమం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత దేవాలయ పాలకవర్గం ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామహేశ్వరరావు, సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు అధ్యక్షత వహించిన డాక్టర్ వి. నాగరాజ్యలక్ష్మి సింహాచల శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవాలయ విశిష్టతలను గూర్చి ప్రసంగించారు. డాక్టర్ మైలవరపు లలితకుమారి ప్రసిద్ధ కవి దాశరధి జయంతి సందర్భంగా ఆయన కవితావైభవాన్ని గురించి ప్రసంగించారు. డాక్టర్ మాధవపెద్ది విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిన్నారులు తమ గాత్ర ధారణలో పలు భక్తిగీతాలను శ్రావ్యంగా ఆలపించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి