విశిష్టమైనది మానవజన్మ సమస్త జీవరాశులన్నింటిలో మానవ జన్మ ఎంతో విశిష్టమైనదని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచకులు నిష్టల నరసింహమూర్తి అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై మంగళవారం గురువైభవంపై ఆధ్యాత్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి వూటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిష్ఠల నరసింహమూర్తి గురు పౌర్ణమి ప్రాధాన్యతను వివరిస్తూ శంకరులును జగద్గురువులు అని ఎందుకు అంటారో వివరించారు. గురువు త్రిమూర్త్యాత్మకుడు అని అనడానికి కారణము, అష్టావక్రుడు, జనకునికి బ్రహ్మోపదేశం చేసిన తీరు వివరించారు. ఏది ఏమైనా గురు ప్రసాద ధన్యత నాస్తి సుఖం మహితలే గురువుగారి అనుగ్రహము కన్నా ప్రపంచంలో సుఖమనేది ఎక్కడ లభించదని తెలియజేశారు.
నలోపాఖ్యానంపై ఆధ్యాత్మిక ప్రవచనం
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై బుధవారం మహాభారతంలోని అరణ్యపర్వంపై ఆధ్యా త్మిక ప్రవచనం జరిగింది. తొలుత ఆలయ కమిటీ అధ్యక్షుడు సీహెచ్ మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్యాత్మికవేత్త గుదిమెళ్ళ శ్రీకూర్మనాథస్వామి ప్రవచిస్తూ నలుడిని ఆవహించిన కలి పురుషుడు కర్కోటకుడి విషాన్ని కక్కుతూ నలుడి శరీరం నుంచి బయటకు వచ్చి అతడికి నమస్కరించి వెళ్లిపోయాడన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి