చిరస్మరణీయుడు సాంబయ్య - 11.06.2025
చిరస్మరణీయుడు సీహెచ్. సాంబయ్య అని పలువురు వక్తలు కీర్తిం చారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని అన్నమయ్య కళావేదికపై ఆత్మీయ ఆర్ట్స్ థియేటర్, సీహెచ్. సాంబయ్య స్మారక పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో 'విద్యాప్రదాత' సాంబయ్య 36వ వర్ధంతి, ఆత్మీయ ఆర్ట్స్ థియేటర్ 16వ వార్షికోత్సవం బుధవారం రాత్రి నిర్వహించారు. నిర్వాహకుడు సీహెచ్. భాస్కరరావు అధ్యక్షత వహించిన సభలో విక్రమ సింహపురి వర్సిటీ వీసీ ఆచార్య అల్లం శ్రీనివాసరావుకు సీహెచ్.సాంబయ్య స్మారక పురస్కారమిచ్చి నిర్వాహకులు సత్కరించారు. తొలుత ఆలయ పాలకమండలి ప్రధాన కార్యదర్శి బొర్రా ఉమామ హేశ్వరరావు, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సభలో ఐఆర్డీఎస్ సీనియర్ డివిజనల్ ఆపరేషన్స్ మేనే జర్ ఎం.దినేష్కుమార్, ఆంధ్రకేసరి యూనివర్సిటీ రిజి స్ట్రార్ ఆచార్య హరిబాబు, జీఎస్టీ అధికారి ఎన్.శ్రీనివాస రావు, నాటక రచయిత, దర్శకుడు కావూరి సత్యనారాయణ, సి. చైతన్య తదితరులు అల్లం శ్రీనివాసరావును సత్కరిం చారు. ఇదే వేదికపై లేఖ్యాభరణి బృందం కూచిపూడి నృత్యం, పూజిత, అర్చన భరత నాట్యాన్ని ప్రదర్శించారు. వంగిపురపు శారద వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి