మార్గదర్శి మల్లాది చంద్రశేఖరశాస్త్రి
ధర్మ ప్రచారకుడిగా, పౌరాణిక ప్రవ చన రంగంలో ఏడున్నర దశాబ్దాలు సేవ లందించిన సుప్రసిద్ధ పౌరాణికులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి నేటి తరానికి ఆదర్శనీయులని పలువురు వక్తలు కీర్తిం చారు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై మల్లాది చంద్ర శేఖరశాస్త్ర శతజయంతి సభమంగళవారం రాత్రి జరిగింది. తొలుత ఆలయ పాలకమండలి అధ్యక్షుడు సీహెచ్.మస్తానయ్య, భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణలు జ్యోతి వెలిగించి కార్యక్ర మాన్ని ప్రారంభించి మల్లాది చంద్రశేఖరశాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభకు మల్లాది వేంకట రామనాథశర్మ అధ్యక్షత వహించారు. సంస్కృత పండితుడు డాక్టర్ దీవి నరసింహ దీక్షితులు, హరికథ భాగవతార్ ముప్పవరపు వెంకట సింహాచలశాస్త్రి, విజయవాడ కేబీఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, ఆధ్యాత్మిక ప్రవచనకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథస్వామి తదితరులు మల్లాది చంద్రశేఖరశాస్త్రి జీవిత చరిత్ర, ఆదర్శ గుణగణాలు, పౌరాణిక రంగంలో ఆయన ప్రత్యేకతలు వివరించారు. ఈ సందర్భంగా అతిథులను, వక్తలను నిర్వాహకులు సత్కరించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి