ఆకట్టుకున్న సీతాకళ్యాణం హరికథాగానం - 09.06.2025
స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం కాజన విశ్వరూపాచారి వర్ధంతి సందర్భంగా జరిగిన సీతాకళ్యాణం హరికథాగానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత ఆలయ కమిటి సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రముఖ హరికథా భాగవతారిణి తిరువళ్ళూరి దివ్యసాయి సీతాకళ్యాణాన్ని హరికథాగానం ప్రారంభిస్తూ బాలకాండ ఆధారంగా సమిష్టి తారాగణం చిత్రం విష్ణువు ఏడవ అవతారమైన శ్రీరాముడి జననం నుండి లక్ష్మీ అవతారమైన సీతతో అతని వివాహం వరకు జరిగిన సంఘటనలను, శ్రీరాముడు వసంత వర్షాలను కురిపిస్తాడని, భూమి తల్లికి జన్మించిన సీతామాత ప్రపంచాన్ని పోషించడానికి ఉత్తమ పంటలు పండించడానికి సారవంతమైన భూమిని మనకు ఇస్తుందని నమ్మకంతో భూమిపై జీవాన్ని నిలబెట్టడానికి ప్రతి సంవత్సరం సీతారామ కళ్యాణం నిర్వహిస్తారని హరికథాగానంతో దివ్యసాయి చక్కగా వివరించారు. వయెలిన్‌పై దక్షిణామూర్తి, మృదంగంపై సుబ్బారావు వాయిద్య సహకారం అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి