హనుమంతుడిని యువత ఆదర్శంగా తీసుకోవాలి నేటి యువత హనుమంతుడిని ఆదర్శంగా తీసుకోవాలని, తద్వారా యువత విజయం సాధించవచ్చని ప్రవచనకర్త మల్లాది కైలాసనాథ్ అన్నారు. స్థానిక బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై గురువారం ఆధ్యాతి ్మక ప్రవచనం చేశారు. ఆలయ కమిటీ అధ్య క్షులు సీహెచ్.మస్తానయ్య, సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. మల్లాది కైలాష్ నాథ్ ప్రసంగిస్తూ హనుమంతుడు మహాజ్ఞాని వీరుడు అని చెప్పారు. శ్రీరామునికి బంటుగా అతనికి మేలు కలగాలని ఉద్దేశంతో అత్యుత్తమంగా పని చేశాడని తెలిపారు.హనుమంతుడి హృద యపూర్వకమైన భక్తిని అందరం ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
భక్తితోనే పురుషోత్తమప్రాప్తి
అనన్య భక్తితోనే పరమాత్ముడైన పురుషోత్తముని చేరవ చ్చని చిన్మయ మిషన్ సువీరానంద స్వామి తెలిపారు. బృందావన్ గార్డెన్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలోని అన్నమయ్య కళావేదికపై బండ్లమూడి విజయలక్ష్మి సౌజన్యంతో భగవద్గీత 15వ అధ్యాయంలోని పురుషోత్తమ ప్రాప్తియోగంపై ప్రవచనాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. తొలుత ఆలయ కమిటీ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరావు జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సువీరానందస్వామి ప్రవచనాలు చెప్తూ.. భక్తి ద్వారా త్రిగుణాలు దాటవచ్చని, బ్రహ్మ సాక్షాత్కారం పొందవచ్చని వివరించారు.
కామెంట్‌లు
కామెంట్ను పోస్ట్ చేయండి