వైభవంగా ప్రారంభమైన మహా మంజీర నాదం
స్థానిక బృందావన్ గార్డెన్స్, అన్నమయ్య కళా వేదికపై అంతర్జాతీయ నృత్య దినోత్సవం పుర స్కరించుకుని సాయి మంజీరా కూచి పూడి ఆర్ట్ ఆకాడమీ ఆధ్వ ర్యంలో వారం రోజుల పాటు జరిగే మహా మంజీర నాదం కార్యక్రమం బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు చిట్టిపోతు మస్తానయ్య, మిర్చియార్డు మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు ప్రారంభించారు. కార్యక్రమానికి సంస్థ అధ్యక్షుడు డాక్టర్ భూసురపల్లి వేంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథులుగా మోదుగుల రవికృష్ణ, అక్కి రాజు శ్రీహరిబాబు హజరై మేలట్టూరు శ్రీకాంత్ నటరాజన్‌ను అక్కిరాజు మణి ప్రియస్మారక సాత్రాజితి పురస్కారం, ఏలూరు జయశ్రీ, దంగేటి సాత్వికలను ఖాజా వేంకట సుబ్రహ్మణ్యం ఘనంగా సత్కరించారు. అనంతరం శ్రీకాంత్ నటరాజన్ మేలట్టూర్ సంపద్రాయ నృత్యాన్ని, దంగేటి సాత్విక ఆంధ్ర నాట్యం, ఏలూరి జయశ్రీ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించి కళాభిమానులను సమ్మోహనపరిచారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి